తెలంగాణలో నిన్న ఒక్క రోజే రూ.219 కోట్ల మద్యం అమ్మకాలట

హైదరాబాద్:ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే.దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కో ట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు.నేటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చా రు.ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపో లలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా కేవలం నిన్న ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం.ఇక తెలంగాణలో మొత్తం 2, 200 మద్యం దుకాణాలు ఉన్నాయి.కాగా గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు.ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి.కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్‌ కొనసాగాయి.మద్యం దుకాణాలు ఉదయం 6 నుం చి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు.సంపన్నులతో పాటు పేద మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు.కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు.ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు.మరికొందరేమో లాక్‌ డౌన్‌ గడు వు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here