న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు భారీ స్టాయిలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపద్యంలో 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు అవుతున్నాయి.ఇక దేశంలో పాజిటివిటి శాతం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్య లు చేసింది.దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే తప్పని సరిగా లాక్‌డౌన్‌ను అమలు చేయడం తప్పనిసరి అని ఐసీఎంఆర్ ఛీఫ్ పేర్కోన్నారు.దేశంలో పాజిటి విటి 10శాతం కంటే ఎక్కువున్న ప్రతిచోట కఠినమైన లాక్‌డౌన్ అవసరమని ఐసీఎంఆర్ ఛీఫ్ పేర్కోన్నారు.అత్యధిక పాజిటివిటి ఉన్న ప్రతి జిల్లాలో కఠిన ఆంక్షలు అ మలుచేయాలని ఐసీఎంఆర్ తెలియజేసింది.ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తే పరిస్థతి మరింత దారుణంగా ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది.
