మోదీ మీడియా సమావేశాల్లో అందుకే పాల్గొనరా..?

న్యూఢిల్లీ:ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది.అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రమే కా దు వారి అవసరాలు సమస్యలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.పాలకులు ప్రజా జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి.అయితే ప్రజలకు అ నుగుణంగా పాలన చేయకపోయినా వారి సమస్యలను పట్టించుకోకపోయినా అప్పుడు ప్రజలకు పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుంది.ఈ క్రమంలోనే ప్రజల తరఫు న మీడియా ఆ హక్కును పొంది వారి తరఫున పాలకులను ప్రశ్నిస్తుంది.అయితే మీడియా పాలకులను ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ప్రజలకు మాత్రం ఆ హక్కు ఉంటుంది.వారిచే ఎన్నుకోబడిన పాలకులు వారికి జవాబుదారీగా ఉండాలి.వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పాలకులు ప్రజల నుంచి దూరంగా ఉంటారు.ప్రజా సమస్యలను పట్టించుకోరు అని కాదు కానీ ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు బదులు చెప్పేం దుకు వారు సుముఖంగా ఉండరు.అయితే ప్రధాని మోదీ కూడా సరిగ్గా ఇందుకే విలేకరుల సమావేశాలు నిర్వహించరా ?అంటే సరిగ్గా చెప్పలేం.కానీ మోదీ మీడియా సమావేశాలను ఎప్పుడూ నిర్వహించరు.ఆయన వాటికి దూరంగా ఉంటారు.నెల రోజులకు ఒకసారి మన్ కీ బాత్ ద్వారా ఆయన తన మనస్సులో ఉన్న మాటలను ప్రజలకు చెబుతారు.అది వన్ వే.ఆయన చెప్పింది జనాలు వినాలి.అంతే.దేశంలో ఉన్న పరిస్థితులపై కేంద్రం తీసుకునే నిర్ణయాలపై విలేకరుల సమావేశాలను మోదీ నిర్వహించరు.నిర్వహిస్తే విలేకరుల అడిగే ప్రశ్నలకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.మోదీ ప్రెస్‌ను పిలవరని మోదీకి గతంలో ఓ రెండు సార్లు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైందట.అందుకనే ఆయన విలేకరుల సమావేశాలు నిర్వహించరని చెబుతారు.అయితే మోదీ విలేకరుల స మావేశాల్లో ఎందుకు పాల్గొనరు ?మరి భవిష్యత్తులోనైనా ఆయన ప్రెస్‌తో మాట్లాడుతారా?లేదా అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here