2లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన కాటారం తహశీల్దార్

జయశంకర్ భూపాలపల్లి:రైతును 3లక్షలు లంచం అడిగిన ఎమ్మార్వో బేరమాడితే రూ.2లక్షలు తీసుకునేందుకు ఒప్పుకుని లంచం డబ్బు తీసుకుంటూ అవినీతి నిరో ధక శాఖ అధికారులకు దొరికిపోయింది.గురువారం ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతు దగ్గర లంచం తీసుకుంటూ కాటారం ఎమ్మార్వో మేడిపల్లి సునీత ఏసీబీకి దొరికిపోయిన ఘటన సంచలనం సృష్టించింది.రైతు కొత్త పాస్ పుస్తకాల కోసం తిరుగుతున్నాడు.అధికారులెవరూ సరిగా స్పందించకపోతే గట్టిగా నిలదీ శాడు.దీంతో లంచం ఇవ్వనిదే పనిజరగదని తేల్చి చెప్పడంతో ఎంత ఇవ్వాలని అడిగాడు.తాహశీల్దార్ సునీత రూ.మూడు లక్షలు డిమాండ్ చేసింది.బాధిత రైతు నుం చి కార్యాలయంలోనే రెండు లక్షలు లంచం తీసుకుంది.అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here