ఈటలకి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం మద్దతు..

కరీంనగర్:ఇల్లందకుంట మండలం లో జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్,జాతీయ కార్యవర్గంతో పాటు,5 జిల్లాల అధ్యక్షులు ఈటల చేస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు.ఇల్లందకుంట మండలంలో ని బూజునూర్ గ్రామంలో ఈటలనీ కలిసి తమ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టేది దళితబంధు కాదు ధగా బంధు అని అన్నారు.తెలంగాణలో 60శాతం ఉన్న బిసిల మీద టీఆరెఎస్ ప్రభుత్వం కక్ష కట్టింది.మొదటి నుండి టీఆరెఎస్ ప్రభు త్వం బిసిలను మోసం,ధగా చేస్తుంది.ఎన్నికలు రాగానే గొర్లు,బర్లు,ఆత్మగౌరవ భవనాలు ఇస్తం అంటూ అనేక తాయిలాలు ప్రకటిస్తుంది.బిసిలకు హైద్రాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు ఇస్తామని టీఆరెఎస్ ప్రభుత్వం చెప్పింది.ఆత్మ గౌరవ భవనాలను ఎన్నికల భవణాలుగా మార్చింది తప్ప మరొకటి లేదు.రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కాలర్ షిప్,సన్న బియ్యం లాంటి పథకాలు తీసుకు వచ్చి బిసిల మేలు కోసం పని చేసిన వ్యక్తి ఈటెల రాజేందర్.ఈటెల ను ఒడించడమే లక్ష్యంగా టీఆరెఎస్ ఎన్ని కల తాయిలాలకు తెర లేపింది.హుజురాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు ఇస్తామని నమ్మిస్తున్నారు.రాజకీయ ప్రయోజనాల కోసమే దళిత బంధు పథకం తెచ్చామని కేసీఆర్ చెప్పడం దురదృష్టకరం.బిసి కార్పొరేషన్ లో స్వయం ఉపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 95వెల మంది దరఖాస్తు చేసుకున్నరు.ఏంబిసి,బిసి కార్పొరేషన్ కు 500కోట్లు చొప్పున కేటాయించారు.అందులో ఒక రూపాయి కూడ ఇప్పటి వరకు ఖర్చు చేయలేదు.ఎంబిసి,బిసి కార్పోరేషన్లకు వెయ్యి కోట్లు ఇస్తే 5లక్షల 96 వేల మందికి రుణాలు వస్తాయి.రాష్ట్రంలో 90శాతం ఉన్న ఎస్సి,ఎస్టీ,బిసి లను మోసం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.హైద్రాబాద్ వరుదల్లో 20వేలు ఇవ్వనోడు 10 లక్ష లు ఇస్తామంటే నమ్ముతారా.దళిత బంధు కాదు ధగా బంధు.ఈటెల రాజేందర్ లాంటి నాయకుడిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉంది.అందుకే మేము మ ద్దతుగా వచ్చాము.తెరాస కి మద్దతు తెలుపుతున్న సంఘాలు అన్నీ ప్రగతి భవన్ కూలీ సంఘాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here