బైంసా:తెలంగాణలో ఆగకుండా కురుస్తున్న వానలకు నిర్మల్‌తో పాటు బైంసా నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.ఆటో నగర్‌లో సహాయక కార్యక్రమాలు సాగుతు న్నాయి.అయితే,ఈ వరద నీటిలో భైంసా ఎన్.ఆర్.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోయారు.దీంతో 12 మంది గజ ఈతగాళ్లు రం గంలోకి దిగి బోట్ల సాయంతో వారిని రక్షించారు.అంతేకాక ప్రజల్ని కూడా కాపాడారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 22 మంది పోలీసులతోపాటు బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది.బాధి తులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.భైంసా సమీపంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అధి కారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తేశారు.దీంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
