తెలంగాణలో కుండపోత వర్షాలు..పొంగిపొర్లుతున్నవాగులు

కరీంనగర్:తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో వాగులు నిండి పారుతున్నాయి.కుంటలు,చెఱువులు పొంగిపొర్లుతున్నాయి.ఎక్కడ చూసినా వరదలు, గ్రామాల్లో పట్టణాల్లో కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తోంది.లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడమే గాక కొన్ని ఇండ్లు కూడా నీటిలో మునిగిపోయాయి.పాత ఇం డ్లు కూలిపోయాయి.అక్కడక్కడ ప్రమాదాలు కూడా జరిగాయి.రోడ్ల వెంటగల వాగుల్లో నీటి ప్రవాహం అధికమై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యా యి.కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.జగిత్యాల,నిజామాబాద్,నిర్మల్ జిల్లాలను ఆనుకొని ఉన్న గోదావరి నది వరద ఉధృతం గా ప్రవహిస్తోం ది.గోదావరి నదికి పై భాగాన గల ఎస్సారెస్పీ ప్రాజెక్టు,కడెం ప్రాజెక్టు లు మొత్తం వరద నీటితో పూర్తిగా నిండిపోగా గేట్లన్నీ ఎత్తివేసి అధికారులు గోదావరి నదిలోకి నీటిని వదిలారు.దీనితో గోదావరి నది నీటి ప్రవాహం మరింత పెరిగిపోయింది.ఎల్లంపెళ్ళి ప్రాజెక్టు లోకి భారీగా నీటి ప్రవాహం చేరింది.ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ లోని మానేరు కూడా నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు.అనేక చోట్ల కుంటలు,చెరువుల మత్తళ్ళు ఎక్కిపారాయి.కొన్ని చోట్ల ప్రమాదం సంభవించే స్థాయిలో నీటి మట్టం ఏర్ప డింది.దాదాపు అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.లోతట్టు ప్రాంతాల వద్ద పోలీసులు,రెవెన్యూ,ఇతర శాఖల అధికారు లు క్యాంప్ లు ఏర్పాటు చేశారు.హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి వాగులు పొంగిపొర్లగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు.పో లీసులు బారీకేడ్లను ఏర్పాటు చేసి రోడ్డుకు అడ్డంగా పెట్టారు.రిస్కు టీమ్ లను సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అందరికీ ఆదేశాలు జారీ చేసి అప్రమత్తంగా,అందుబాటులో ఉండాలని సూచించారు.సెలవుల్లో ఉన్న వారిని కూడా వెం టనే బాధ్యత ల్లో చేరాలని ఆదేశించారు.ప్రజా ప్రతినిధులు,నాయకులు,యువత,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది సోషల్ మీడియాలో తగు సూచనలతో కూడిన పో స్టులు చేసి ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కలిగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here