భారత్‌లో‌..మరో విధ్వంసం తప్పదా?

న్యూఢిల్లీ:కరోనా మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే రెండో దశ వ్యాప్తి చెందింది.దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించింది.ఐతే రెండో దశలో భారీగా మర ణాలు నమోదైనా జనాలు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు.జాగ్రత్తగా లేకుంటే మూడో దశ వ్యాప్తి విరుచుకుపడుతుందని పెను ముప్పు తప్పదని ఇటు ప్రభుత్వాలు అ టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఐనా చాలా ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహహరిస్తున్నారు.మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో భౌతిక దూరం పాటించ కుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.మాస్క్ లేకుండానే సంచరిస్తున్నారు.ఈ కారణంగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది.ఆర్ నెంబర్ పెరగడమే ఇందు కు నిదర్శనం.కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ వ్యాల్యూగా పేర్కొంటారు.ఒకవేళ ఆర్ వ్యాల్యూ 0.82గా ఉందనుకోండి.100 మం ది కరోనా బాధితుల నుంచి ఆ వ్యాధి మరో 82 మందికి సోకుతున్నట్లు లెక్క.జూన్ నెలాఖరు వరకు కరోనా సంక్రమణ రేటు తగ్గూతూ వచ్చింది.కానీ జూన్ 20 నుం చి జులై 7 మధ్య మళ్లీ పెరిగింది.మే 15 నాటికి ఆర్ వ్యాల్యూ 0.78 గా ఉండేది.కానీ జూన్ 26కు వచ్చే సరికి దాని విలువ 0.88కి చేరింది.అంటే మేలో ప్రతి 100 మంది బాధితుల నుంచి 78 మంది వ్యక్తులకు కరోనా సోకగా ప్రస్తుతం 88 మందికి వ్యాప్తి చెందుతోంది.ఈ విషయాన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌ వెల్లడించింది.ఆర్ వ్యాల్యూ తగ్గుతూ వస్తే కరోనా కేసులు కూడ తగ్గుముఖం పడతాయి.క్రమంగా కోవిడ్ కనుమరుగు అవుతుంది.కానీ ఒకవేళ ఆర్ వ్యాల్యూ 1 దాటిందంటే కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతుంది.కేసులు అనూహ్యంగా పెరుగుతాయి.అందుకే పెరుగుతున్న ఆర్ వ్యాల్యూని చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.కరోనా మూడో దశ వ్యాప్తికి ఇవే బలమైన సంకేతాలని అభిప్రాయపడుతున్నారు.రోజువారీ కరోనా కేసులు 10వేల లోపు వస్తేనే కోవిడ్ తగ్గినట్లుగా భావిం చాలని అన్నారు.మన దేశంలో ఆ పరిస్థితి వచ్చేందుకు మరో మూడు వారాలు పట్టవచ్చని తెలిపారు.అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కా గా మనదేశంలో ప్రస్తుతం కేరళ,మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయి.మొత్తం కేసుల్లో 30శాతంపైగా కేరళలోనే నమోదవుతున్నాయి.అంతేకాదు ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ 1పైనే ఉంది.కేరళలో 1.1,మహారాష్ట్రలో 1గా ఉంది.అందుకే అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తేనే ఆర్ వ్యాల్యూ తగ్గుతుంది.అప్పుడే మనం కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here