తల్లి పెళ్లిని..నిలిపివేయాలని కూతుళ్లు..వారి కోసమే పెళ్లంటున్న మహిళ

భోపాల్:ఓ మహిళ వయసులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైంది.అప్పటికే ఐదుగురు కూతుళ్లకు తల్లి అయిన ఆమె 30 ఏళ్ల వ్యక్తితో కలిసి ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది.ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాలు 45 ఏళ్ల ఓ మహిళ భిండ్ ప్రాంతంలో నివసిస్తుం ది.ఆమె ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.మొదటి భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు.రెండో,మూడో భర్తలు చనిపోయారు.ఆ తర్వాత మహిళ నాలుగో పెళ్లి చేసుకుంది.అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.ఆమెకు ప్రస్తుతం ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.కూతుళ్లలో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా,మరో ముగ్గురి పెళ్లి జరగాల్సి ఉంది.అయితే గత కొంతకాలంగా ఆ మహిళ 30 ఏళ్ల మిథున్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.వీరిద్దరు కలిసి సహజీనం కూడా చేస్తున్నారు.మహిళ,ఆమె కూ తుళ్ల ఖర్చులు కూడా మిథన్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే తాజాగా మిథున్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ మహిళ సిద్దం అయింది.తల్లి 5వ సారి పెళ్లి చేసుకో బోందని తెలుసుకున్న వెంటనే ఆమె కూతుళ్లు,అల్లుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి వివాహాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అయితే ఆ మహిళ మాత్రం వివాహం నిలిపివేయడానికి సిద్ధంగా లేదు.తన కూతుళ్లు పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని మహిళ తెలిపింది.తాను ఐదో పెళ్లి చేసుకుంటుంది కూడా తన కూతుళ్ల భవిష్యతు కోసమే నని తెలిపింది.మహిళ కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకుని తన వాదన వినిపించింది.దీంతో పోలీసులు ఏం చేయాలో,ఈ సమస్యను పరిష్కరిం చడానికి ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here