అక్టోబర్లో హైదరాబాద్ లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ సభ

హైదరాబాద్:అక్టోబర్ లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూ తో పాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి.రానున్న రెండు నెలల వ్యవధిలో దాదాపు 28 రాష్ట్రాల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.హైదరాబాద్ లో సోమవారం జరిగిన సమావేశం లో ఐజేయూ అధ్యక్షు లు,ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు వినోద్ కోహ్లీ,టీయూడబ్లూజే అధ్యక్షులు అల్లం నారాయణ,సలహాదారులు చంటి క్రాంతి కిరణ్,ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్,రాష్ట్ర ఉపాధ్యక్షు లు రమేష్ హజారే,చండీఘర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నవీన్ శర్మ,టెంజు అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్,కార్యదర్శి రమణ కుమార్ లతో పాటు అనేకమంది రాష్ట్ర,జాతీయ సంఘ నాయకు లు సమావేశమై ఈ నిర్ణ యాన్ని ప్రకటించారు.జర్నలిస్టుల హక్కుల సాధనకై జాతీయ స్థాయి లో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమావేశం అభిప్రాయపడింది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మీడియా విస్తృతి ఎక్కువని,ఇలాంటి జాతీయ సదస్సు ఇక్కడ నిర్వహిస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.జర్నలిస్టుల జాతీయ సెమినార్ సందర్భంగా జా తీ యస్థాయిలో జర్నలిస్టుల సమస్య లతో పాటు ప్రత్యేక సెషన్ లో వర్తమాన భారత దేశం ఎదుర్కొంటున్న లౌకిక వాద సమాఖ్యవాద సమస్యలను ప్లీనరీ చర్చించనున్నది.తెలంగాణ కోసమే తెలం గాణ జర్నలిస్టులు ‘అనే నినాదంతో పోరాటం చేసి రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన (తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం) తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఎనిమిదేళ్ల తెలంగాణ అభివృద్ధి రాజకీయ పరిస్థితులపై మరో సెషన్ లో చర్చించనున్నది దేశంలోని 28 రాష్ట్రాల నుండి దాదాపు మూడు వందలకు పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ ప్లీనరీ మూడు రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించా రు.ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లీనరీలలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు.కార్యక్రమంలో టియూడబ్లూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్,హైదరాబాద్ అధ్యక్షులు యోగానంద్,కార్యదర్శి నవీన్ కుమార్,రాష్ట్ర నాయకులు రాజమౌళి చారీ,సూరజ్ భరద్వాజ,రాజ్ నారాయణ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here