●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.?
హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల నుండి కనబడుటలేద ని,స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.కాగా అదృశ్యమైన మహిళ భర్త కమల్,సోదరుడు అప్సర్ తెలంగాణ వాణి తో తన గోడును వెలిబుచ్చుతూ పలు అనుమానాలు వ్యక్తపరిచారు.వా రి భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని,కాకపోతే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పేదరికపు బ్రతుకును కొనసాగించడం కోసం తన భార్య కూలి పనులకు వెళ్ళేదాని,అక్కడ పరిచయ మైన బెజ్జెంకి మండలం లక్మిపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి,తన భార్యకు మాయమాటలు చెప్పి,మాదక ద్రవ్యాలు అలవాటు చేసి ఉంటాడని,తనకోసం వాకబు చేయగా పలు విషయాలు తెలుస్తు న్నాయని అన్నారు.గతంలో బెజ్జెంకి,పోలీస్ స్టేషన్ పరిధిలో సదరు అనుమానితుడిపై మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయినట్లు తెలుస్తుందని,తన ఆవేదనను వెలిబుచ్చారు.అంతేకాకుండా ఇతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు ఇలాగే వేరే మహిళను కూడా లోబర్చుకొని హైదరాబాద్ లోని బీరంగుడా ప్రాంతంలో అడ్డా ఏర్పరచుకున్నట్లు తెలుస్తుందని,కన్నీరు పెట్టుకున్నారు.తనకు పది సం వత్సరాల బాబు ఉన్నాడని,ప్రతి రోజు వాళ్ళ అమ్మను గుర్తు చేసుకొని ఏడుస్తున్నాడని,తెలుపుతూ.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.