నల్లగొండ:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ప్రకటన విడుదల చేశారు.మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం చల్లమల్ల కృష్ణా రెడ్డి,పల్లె రవి,పున్నకైలాష్,పాల్వాయి స్రవంతిలు పో టీపడగా పార్టీ అధిష్టానం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.స్రవంతి దివంగత రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు.పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజక వర్గం నుంచి 1967లో 1972,1978,1983,1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఐదు సార్లు గోవర్ధన్ రెడ్డి మునుగోడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు.2007లో ఏపీ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2009 వరకు కొనసాగారు.2012 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పదవిలో ఉండగానే 2017 జూన్ 9న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి ప్రాం తంలో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన సందర్భంలో గుండెపోటుకు గురై మృతి చెందారు.
