ప్రారంభమైన బోనాలు..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్:తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యా యి.లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి,శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ నెల 25న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు,తర్వాత ఆగస్టు 1న లాల్ దర్వరాజ మహంకాళి అ మ్మవారి బోనాలు భారీగా జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ బోనాల ఉత్సవాలకు తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్ గఢ్,మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కూడా వేలాది భక్తులు హాజరవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here