కేటీఆర్​కు నిరసన సెగ..

నారాయణపేట:రాష్ట్ర మున్సిపల్​,ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ తాకింది.కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు.పట్టణ ప్రగతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్​ నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అయితే మంత్రి కాన్వాయ్​ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు.తెలంగాణలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడు దల చేయాలని ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్​ చేశారు.అయితే ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్​ చేశారు.అనంతరం వారిని అదుపులోకి తీసుకు న్నారు.ఈ క్రమంలో నారాయణపేటలో కాస్త ఉద్రిక్తత నెలకొన్నది.నారాయణ పేటలో కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.అంబేద్కర్ చౌరస్తా నుంచి సావర్కర్ చౌరస్తా వరకు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే సివిల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు,సింగారం చౌరస్తా వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించే టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి,అశోక్ నగర్ వద్ద రూ.20 లక్షలతో అమరవీరుల స్తూపం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం నారాయణపేట ప్రభుత్వా స్పత్రిలో వెంటిలేటర్లతో ఏర్పాటుచేసిన వార్డును మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు.సాయివిజయ కాలనీలో రూ.70 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకోవడం చర్చనీయాంశం అయ్యింది.ఓ వైపు ప్రతిపక్షాలు ఉద్యోగాల నోటిఫికేషన్​ విడుదల చేయా లంటూ డిమాండ్​ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్​ ని విద్యార్థులు అడ్డుకోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here