టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం..

టోక్యో:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది.వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల వి భాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది.స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి,క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తింది.మొత్తమ్మీద 202 కేజీ లు ఎత్తిన మీరాబాయి.స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది.క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది.దాంతో రజతంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్‌ జిజోయ్‌ పసిడిని దక్కించుకున్నారు.భారత్‌ తరపున పతకం సాధించిన రెండో వెయిట్‌ లిఫ్టర్‌గా మీరాబాయి ఘ నత సాధించారు.సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత వెయిట్‌ లిఫ్టర్‌గా మీరాబాయి నిలిచా రు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా నా కల నెరవేరింది.ఈ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నాను”అని భావోద్వేగానికి గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here