12 సెంట్రల్‌ యూనివర్సిటీకు..వీసీల నియామకం

న్యూఢిల్లీ:దేశంలోని 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్,హర్యానా,హిమాచల్‌ప్రదేశ్,జమ్మూ,జార్ఖండ్,కర్ణాటక,తమిళనాడు,గయాలోని దక్షిణ బిహార్,మణిపూర్‌ విశ్వవిద్యాలయం,మౌ లానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం,నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ విశ్వవిద్యాలయం,బిలాస్‌పూర్‌ గురు ఘాసిదాస్‌ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం జరిగిం ది.కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ నూతన వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సత్యనారాయణను నియమించారు. దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో మొత్తం 22 వైస్‌ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని,అందులో 12 పోస్టులకు నియామకాలను రాష్ట్రపతి ఆమోదం తెలిపా రని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు.అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి వీసీలు లేని సెంట్రల్‌ యూనివర్సిటీలలో బనారస్‌ హిం దూ యూనివర్సిటీ,ఢిల్లీ యూనివర్సిటీ,జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్త వైస్‌ ఛాన్స్‌లర్లు వీరే..హరియాణా సెంట్రల్‌ యూనివర్శిటీ-ప్రొఫెసర్‌ (డాక్టర్‌) తంకేశ్వర్‌ కుమార్,‌హిమాచల్‌ ప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ-ప్రొఫెసర్‌ సత్‌ ప్రకాష్‌ బన్సాల్,‌జమ్మూ సెంట్రల్‌ యూనివర్శిటీ-డాక్టర్‌ సంజీవ్‌ జైన్,‌జార్ఖండ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ-క్షితి భూçషణ్‌ దాస్,‌కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ-ప్రొఫెసర్‌ బట్టు సత్య నారాయణ,తమిళనాడు సెంట్రల్‌ యూనివర్శిటీ-ప్రొఫెసర్‌ ముత్తుకలింగన్‌ కృష్ణన్,‌హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ-డాక్టర్‌ బసుత్కర్‌ జె రావు,దక్షిణ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ-ప్రొఫెసర్‌ కామేశ్వర్‌నాథ్‌ సింగ్‌,నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ-ప్రొఫెసర్‌ ప్రభాశంకర్‌ శుక్లా,గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ-డాక్టర్‌ అలోక్‌ కుమార్‌ చక్రవల్‌,మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ-ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఐనుల్‌ హసన్,‌మణిపూర్‌ యూనివర్సిటీ-ప్రొఫెసర్‌ ఎన్‌.లోకేంద్ర సింగ్‌,నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here