క్యారెట్‌ తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?

ఆసిఫాబాద్:క్యారెట్‌ని చాలా మంది తింటూ ఉంటారు.కానీ క్యారెట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు,మనలో ఉండే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో చాలా మందికి తె లియదు.ఈ క్యారెట్‌ను కొంత మంది కూరలలోను మరికొంత మంది జ్యూస్ చేసుకొని తాగుతారు.ఇక ఇంకొంత మంది వట్టి క్యారెటే తింటూ కనిపిస్తారు.క్యారెట్‌లోఎన్నో విటమిన్లతోపాటు మన జీవనాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా వున్నాయి.విటమిన్లు ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యా రెట్.ఇది తీపిగా రుచికరంగా ఉండటంతో దీన్ని ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడుతారు.మంచి కూరగాయల లో క్యారెట్ ఒకటి.ఇందులో ఉన్న విటమిన్‌లు,ప్రోటీ న్‌లు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.క్యారెట్ తినడం వలన ఉపయోగాలు..1).క్యార ట్‌లో కెరోటిన్ అనే కంటెంట్ కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది.క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ‘ఎ’గా మారుతుంది.ఇది కంటి పవర్‌ను బాగా పెంచుతుంది.మాస్కులర్ డీజనరేషన్,సెనిల్ కాంటరాక్ట్స్ ను నివారిస్తుంది.2).క్యారె ట్‌లో ఉండే విటమిన్లు,కార్బైడ్స్ మీ జట్టు పొడిబారకుండా చేస్తుంది.3)రోజు ఉదయాన్నే క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.4).పొటాషియం రక్త నాళాలధ మనుల ఉద్రిక్తతను తగ్గిస్తుంది,శరీరంలో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.5).ఇది హృదయనాళ వ్యవస్థ మీద ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.6)చ ర్మాన్ని కాంతి వంతంగా ఉంచుంతుంది.7).క్యారెట్ ను తినడం దాని రసం తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది.తద్వారా బరువు కూడా తగ్గుతా రు.నోటిలో హానికరమైన క్రిములను చంపడానికి మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి క్యారట్ బాగా సహాయపడుతుంది.8).క్యారెట్లు రెగ్యులర్ గా తినడం వల్ల మలబద్దకం దూరం చేస్తుంది.ఇది ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది.9)క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది.రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగనిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది.ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు,దీర్ఘ వ్యాధులకు సైతం చెప్పవచ్చునంటున్నారు10)క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంటుంది.అధిక పోషక విలువలుండటం వలన క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.దీంతో రక్తహీనతకు క్యారెట్ దివ్యఔషదంగా పనిచేస్తుంది.11)తక్షణం శక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి.కాస్త అలసటగా అని పించిననప్పుడు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here