నీ ఫోటో గోడల మీద ఉంటే..నా ఫోటో ప్రజల గుండెల్లో ఉంది:ఈటల

కరీంనగర్:ప్రపంచంలో మనిషికి వెలగట్టే రాష్ట్రం తెలంగాణ,నాయకుడు కెసిఆర్.డబ్బుని,అధికార అహంకారాన్ని నమ్ముకున్నాడు.బస్ ఎక్కించి సిద్దిపేట తీసుకుపోతు న్నారు వెల కట్టి పంపిస్తున్నారు.19 ఏళ్లుగా నేను కాకుండా ఇంకా ఎవరన్నా వచ్చారా? నేను మీకు అండగా ఉన్న.కానీ 3 ఏళ్లుగా ప్రజలు అడిగితే పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి కి నెట్టి వేశాడు కెసిఆర్.కానీ నేను రాజీనామా చేసిన తరువాత ముసలోల్లు, వితంతువు గుర్తు వచ్చారు.నేను రాజీనామా చేయడంతో ఇవన్నీ వస్తున్నాయి తీసుకోండి.రేషన్ కార్డులు వస్తున్నాయి.ఇవన్నీ కేవలం నన్ను ఓడించడానికి మాత్రమే ఇస్తున్నారు.ఒక్క హుజూరాబాద్ కి మాత్రం 20 గొర్లు ఒక పొట్టేలు ఇస్తారట. 43 వేలు కట్టమనిట్ చెప్తున్నాయి ఓడ మల్లన్న సామెతలాగా చేస్తున్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరి జాగాలో వాళ్ళకే కట్టుకొనివ్వలి.10 లక్షల రూపాయలు దళి తులకు కేవలం ఒక్క హుజూరాబాద్ లో మాత్రమే ఇస్తారట సంతోషమే కానీ రాష్ట్రం అంతా ఇవ్వాలి.ఈ వేదిక నుండి దళిత మేధావులకు ప్రేమతోన? ఓట్ల కోసమేనా? తేల్చండి.కెసిఆర్ కి మనిషి కనబడడు ఓటు మాత్రమే కనిపిస్తుంది.ఆయన కన్ను సీఎం కుర్చీ మీద ఉంటుంది తప్ప పేద ప్రజల మీద కాదు.ఉద్యోగాలు ఇవ్వరు. దూప అయినప్పుడు బాయి తవ్వుకున్నట్టు ఎన్నికలు రావాలి పథకాలు పెట్టాలి ఓట్లు దండుకుని కండ్లళ్ళ మట్టి కొట్టాలి అది కెసిఆర్ నైజం.ఏకు మేకు అయ్యిండు అని నన్ను కతం పట్టించిండు.నా భూమి నీ అరగంటల కొలిసిండు,కేసు పెట్టుండు.ఈటల సాయం చేశాడు తప్ప,ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు.నీ ఫోటో గోడల మీద ఉంటే నా ఫోటో ప్రజల గుండెల్లో ఉంది.దాన్ని చెడపడం నీ జేజెమ్మ వల్ల కూడా కాదు.బానిసగా బ్రతకను అని బావుటా ఎగరవేసాను.అండగా నిలవండి.ఒక్కో ఓటు చాలా ముఖ్యం.ఈ ఊర్లో ఉన్న యువత అంతా ఒక సైన్యంలా పనిచేయండి.2023 లో అధికారం మనదే.మోత్కుపల్లి నర్సింహులుతో నాపై విమర్శలు చేయించా రు.ఆయన పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు.నా భార్య ఇప్పటికే సవాల్ చేసింది.మా దగ్గర ఒక్క ఎకరం భూమి అక్రమంగా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని చె ప్పింది.ఏ ఎంక్వైరీ అయినా వేయమని చెప్పాను.కానీ నాలాంటోనిమీద వాళ్లతో మొరిగిస్తున్నాడు కేసీఆర్.నేను వందల మంది మీద కేసులు పెట్టించానని,వందల కోట్లు సంపాదించానని చిల్లర ఆరోపణలు నాపై చేస్తున్నారు.నేను ఎప్పుడైనా ఎవరిదగ్గరనైనా చేయిచాచానా ఒక్క మనిషితోనైనా చెప్పించండి.నాలాంటి వానిమీద ఆరో పణలు చేస్తే మా ఉసురు తగిలి పోతారు.నేను రుషిని కాదు శపించడానికి.కానీ ధర్మమంటూ ఉంది.అది ఎప్పుడో కాదు.ఇప్పుడే మీకు తగిలితీరుతుంది.వీరుడవైతే కొట్లాడు.నీ దగ్గర ధర్మముంటే, న్యాయముంటే ప్రజాక్షేత్రంలో చెప్పు ఎవరేంటో తేల్చుకుందాం.కానీ కిరాయి మనుషులకు డబ్బులిచ్చి ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయించి ధర్మాన్ని గాయపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్ధార్ మళ్లీ ఛాలెంజ్ చేస్తున్నా నీ దగ్గర అధికారం ఉంది.ఎంక్వైరీ చేయించు.తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తే లేదంటే నీవు రాస్తావా? ఆనాడు నయీంలాంటి గూండాలతో చంపించాలని చూసినా నేను భయపడలేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై గంటలకొద్ది పడుకున్నోళ్లం.ఎక్కడ తిన్నమో,ఎక్కడ పడుకున్నమో,మా మీద ఎన్నికేసులున్నవో తెలంగాణప్రజలకు తెలియదా ఆనాడు ధీరలమని పొగడి,తమ్ముళ్లమని చెప్పిన నీకు నేను ఇంతలోనే ఎందుకు దయ్యమయ్యాను.ఏం తప్పు చేసాను నేను.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని,ఫించన్లు ఇవ్వాలని చెప్పడమే తప్పా? మంచి,చెడూ మీరంతా చూస్తున్నారు.మీరే ఆలోచించి తీర్పు చెప్పండి.కేసీఆర్ అహంకారానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమిది.నన్ను లీడర్లకు మీరు దూరం చేస్తుండొచ్చు గాక,ప్రజలను మాత్రం దూరం చేయలేరు.మీ ఫొటోలు ఫ్లెక్సీల మీద ఉంటే మా ఫొటోలు ప్రజల గుండెల్లో ఉంది.అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఎన్నికలను ఎదుర్కొన్నా.18 ఏళ్లలో ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచా. ఇప్పుడొచ్చిన ఎ న్నికలు మా వల్ల రాలేదు.ఇవి కేసీఆర్ మనపై రుద్దిన ఎన్నిక ఇది.ఉద్యమకాలంలో ఉద్యమకారులు గొప్పగా కనపడ్డారు.కానీ ఇప్పుడు ఉద్యమకారులు ప్రజలు కని పించడం లేదు.ఇప్పుడు డబ్బు,అధికారం తప్ప ఏమీ కనిపించడం లేదు.మాదీ ఫక్తు రాజకీయ పార్టీ అని నిన్నకాక మొన్ననే కేసీఆర్ చెప్పాడు.తాను ఏ నిర్ణయ తీ సుకున్నా రాజకీయం కోసమే చేస్తానని,హుజురాబాద్ ఎన్నికలకోసమే దళితబంధు తెచ్చామని చెప్పాడు.ఏడేళ్లుగా దళితుల కోసం ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట డబుల్ బెడ్ రూం ఇండ్లు,మూడెకరాల భూమి వంటివి ఇస్తానని ఇవ్వలేదు.ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా మూడేళ్లుగా కొత్త ఫించన్లు ఆపే సారు.ఇవాళ మాత్రం హుజురాబాద్ లో మాత్రమే ఓట్ల కోసం కొత్త ఫించన్లు ఇస్తున్నాడు.హుజూర్ నగర్,నాగార్జునా సాగర్ ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా చేసా డు.సొంత పార్టీ నాయకులకే వెలగొట్టే పార్టీ దేశంలో టీఆర్ఎస్ ఒక్కటే.చెప్పులు,వస్తువులు కొన్నట్లుగా మనుషులను కూడా కొనే దరిద్ర్యమైన రాజకీయం ఈగడ్డపై చే స్తున్నారు.నాలాంటి బక్కోన్ని,ధర్మాన్ని నమ్ముకున్నోన్ని ఓడించాలని ఇప్పటికే కోట్లు ఖర్చు చేసారు.డబ్బులతో కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా నాకు లేదు.ఆయనను నిలువరించగల సత్తా నాకు లేదు.కానీ ధర్మం,సత్యం గుర్తించి ఆయనను నిలవరించే శక్తి మా నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here