అతడి వయసేమో 26 ఏళ్లు..4 పెళ్లిళ్లు..53 మంది మహిళలతో..

ఔరంగాబాద్‌:నాలుగు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకున్నాడు.అది చాలదన్నట్లు 53 మంది మహిళలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. వీరికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకునేవాడు.చివరకు పోలీసులకు తెలవడంతో వ్యవహారం బయటపడింది.అతడు ఆర్మీ ఆఫీసర్ ని అని చె ప్పుకుంటూ తిరుగుతాడు.అతడి వెంట తన స్నేహితుడిని బాడీగార్డ్ గా పెట్టుకున్నాడు.ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుంటాడు. అంతేకాకుండా ఈ వ్యవహారాల్లో ఎక్కువగా మహిళలే మోసపోయారు.ఏదో ఒక విధంగా నిరుద్యోగ మహిళల ఫోన్ నంబర్లను సంపాధించి ఆర్మీ డ్రస్ లో వాళ్లను కలి సేవాడు.వాళ్లు పూర్తిగా నమ్మిన తర్వాత ఉద్యోగం ఆశ చూపి పార్క్ లు,పబ్ లు అంటూ తిరిగేవాడు.ఎక్కడికి వెళ్లిన తన స్నేహితుడిని వెంట పెట్టుకొని తనకు సెక్యూ రిటీగా పెట్టుకునేవాడు.ఇలా దాదాపు 53 మందితో ఇతడు లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు.అంతేకాకుండా అతడికి అంతకముందే ఒకరికి తెలియకుండా ఒక రిని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. మహిళల వద్ద డబ్బులు తీసుకొని జాయినింగ్ ఆర్డర్ కాపీ అంటూ ఇచ్చి బురిడీ కొట్టించేవాడు.ఓ రోజు అనుమానం వచ్చిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి మోసాలు,రాసలీలలు అన్నీ బయట పడ్డాయి.ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన యోగేష్ దత్తు గైక్వాడ్ అనే వ్యక్తి లీలలు పోలీసులకు కూడా షాకిస్తున్నా యి.తన పేరు రామ్‌ అని,తను ఆర్మీలో మేజర్ అని చెప్పుకుంటూ మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు యోగేష్.అతనికి బౌన్సర్‌గా వ్యవహరిస్తూ ఈ కుట్రలో సహాయకుడిగా ఉన్నాడు అతని స్నేహితుడు సంజయ్.ఏ మహిళను కలవడానికి వెళ్లినా యోగేష్ ఆర్మీ డ్రెస్‌లోనే వెళ్లేవాడు.అతని వెంట సంజయ్ బాడీగార్డ్‌గా ఉండే వాడు.ఇలా 53 మంది మహిళలతో యోగేష్ డేటింగ్ చేశాడు.అలాగే నలుగురు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు.ఆర్మీలో ఉ ద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు.ఆ డబ్బుతో జల్సా చేసేవాడు.అంతేకాదు వారికి ఫేక్ జాయినింగ్ లెటర్స్ కూడా ఇ చ్చాడు.గత నెల 21న ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో యోగేష్ విషయం మొత్తం బయటపడింది.నిజానికి యోగేష్‌పై 2017లోనే పోలీసులు కేసు నమోదు చేశారు.అ యితే అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతూ తాజాగా దొరికిపోయాడు.అతడి నుంచి 12 జతల ఆర్మీ యూనిఫార్మ్స్‌ను,26 జతల షూస్‌ను,రెండు రబ్బర్ స్టాంపుల ను,రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here