రాయికల్ లో వాక్సిన్ కోసం..కుస్తీ పడుతున్న జనం

జగిత్యాల:నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మా రదు లోకం మారదు కాలం అని ఓ మహా కవి ఊరికే అనలేదేమో జగిత్యాల జిల్లా రాయికల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కోవిడ్ వాక్సిన్ కోసం వస్తున్న ప్రజ లు ఏ మాత్రం సామాజిక దూరం పాటించడం లేదు.సిబ్బంది ఉదయం 9 గంటల లోపు చేరుకొని వరుస క్రమము లో ఉంచి వాక్సిన్ కోసం టోకెన్ అందిస్తున్నప్పటికీ ప్రజలు సహకరించడం లేదు.సామాజికదూరం పాటించాలని,క్యూ లైన్ ద్వారా వరుసగా రావాలని ఒకటికి రెండు సార్లు ఆసుపత్రి సిబ్బంది సూచిస్తున్న మంగళవారం వాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు పెడచెవిన పెడుతూ ఒకరినొకరు నెట్టుకున్నారు.ఇది ఇలాగే కొనసాగితె కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ ఆరోగ్య సిబ్బం ది ముందస్తుగా టోకన్లు కూడా జారీ చేస్తుంది.ఆధార్ కార్డుల ప్రకారం ఒక్కక్కరువెళ్లి వాక్సిన్ తీసుకోవాల్సిందిపోయి కుమ్ములాటకు దిగుతున్నారు.సామాజిక దూరం పాటించాలి అని ప్రభుత్వాలు ఎన్నీ చెపుతున్న ప్రజలు మాత్రం మాస్క్ లు ధరించకుండా,కనీసం సామాజిక దూరం పాటించకుండా సమస్యను ఇంకా పెద్దది చేస్తు న్నారు. *32 గ్రామాల ప్రజలకు 150 వాక్సిన్ డోసులు* నిత్యం రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 150 మందికి వాక్సిన్ ఇస్తున్నారు.వాక్సినేషన్ సిబ్బందిని పెంచి రోజుకు కనీసం 500 డోసుల వాక్సిన్ ను రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిణి చేయాలనీ,ప్రధాన ద్వారం గుండా ఒక్కసారిగా కాకుండా స్త్రీ,పురుషులను రెండు క్యూ లైన్లలో 10 మందిని మించకుండా లోనికి పంపుతూ సామాజిక దూరం పాటించే వింధంగా వాక్సినేషన్ పారదర్శకంగా చేయాలని,ఎక్కువ డోసులు పంపిణి చేస్తే క్యూ లైన్ రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని మం డల ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here