గోదావరిఖని:ఎర్రటి ఎండ అయితేనేం అవసరం అలాంటిది సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె గోలీలు తెచ్చుకోవల్లె కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె పాపం ఏం చేస్తది ఆ అవ్వ ఒక్కతే అయిపాయె ఒక చేతిలో కర్ర,ఒక చేతిలో సంచి పట్టుకుని మెల్లగా దవాఖానాకు బయలెల్లింది.కానీ రోడ్డు మీద స్పీడుగా వస్తున్న బండ్లకు రోడ్డు దాటుడు ఆమెతో అయితదా ఆ ట్రాఫిక్‌కు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్న ఆ అవ్వను చూసిన ఓ ట్రాఫిక్ పోలీస్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. రోడ్డు దాటించి ఆ అవ్వ ఎక్కడికి పోవాల్లో కనుక్కొని ఆటో ఎక్కించి పంపించాడు.