అడవిలో అలజడి..తుపాకుల మోత

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు,భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం.బీజాపూర్‌ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ తెలిపారు. మావోయిస్టుల ఉనికిని తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌కు చెందిన ఎలైట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) యూనిట్,జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్‌)కు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు.ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి.ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరో పది మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయినట్లు తెలిపారు.వెంటనే అదనపు భద్రతా దళాలను అక్కడికి తరలించినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here