చుక్కల‌ మందు తప్ప..ఆనందయ్య మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి:కృష్ణపట్నం ఆనందయ్య ఔషధానికి ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప ఆనందయ్య ఇస్తున్న పి,ఎల్‌,ఎఫ్‌ మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఆనందయ్య మందుల వల్ల హాని లేద ని అలా అని వాడితే కొవిడ్‌ తగ్గుతుందనడానికి నిర్ధరణలు లేవని నివేదికలో పేర్కొన్నారు.ఏపీ హైకోర్టు కూడా ఈ మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కంటి చుక్క ల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తు తాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చిన నేపథ్యంలో వాటి శాంపిల్స్ కూడా సేకరించి మరో రెండు రోజుల్లో నివేదిక సమర్పించాల ని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప,ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.అలాగే కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి కూడా అనుమతి నిరాకరించింది.అలా ఆనందయ్య ఇచ్చే పి, ఎల్,ఎఫ్‌ మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి.సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని తేల్చినా ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు చెబుతున్నాయి.కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది.నివేదికలు రావడానికి మరో 2-3 వారాల సమయం పట్టేలా ఉన్నా,హైకోర్టు మరో రెండు మూడు రోజుల్లో నివేదిక కావాలని కోరడం ఆసక్తికరంగా మారింది.అలాగే ఆనందయ్య మందు వాడినంత మా త్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here