కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్‌లకు రూ.10లక్షల సాయం:యోగి ఆదిత్యనాథ్

లక్నో:ఆరోగ్య కార్యకర్తలే కాదు కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్‌లు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జర్నలిస్ట్‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ పరిస్థితిలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృ త్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.హిందీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు యోగి ఆదిత్యనాథ్.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందీ జర్నలిజం దినోత్సవం సందర్భం గా ఈ విషయాన్ని ప్రకటించారు.సీఎం యోగి సూచనల మేరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల వివరాలను సేకరించే బాధ్యత సమాచారశాఖకు అప్పగిం చారు.ఈ క్రమంలోనే అధికారులు కరోనా వైరస్ కారణంగా మరణించిన పాత్రికేయుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.మరణించిన జర్నలిస్టుల జాబితాను తయారు చేసి న తరువాత,వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది.కరోనా కారణంగా మరణించిన జర్నలిస్టు కుటుంబానికే సాయం చె య్యాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.గుర్తించబడిన జర్నలిస్టా? లేదా? అన్నది పట్టింపు లేదు.ఒక జర్నలిస్ట్ జర్నలిజం చేస్తుంటే,అతని మరణం కరోనా వైరస్ కారణంగా సంభవించినట్లైతే,అతని కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తుంది.కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు 24 గంటల పాటు పని చే స్తూ సమాచారాన్ని అందిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here