మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు

న్యూ ఢీల్లీ:దేశంలో ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాలను అత‌లాకుత‌లం చేస్తుండ‌గా,మ‌రోవైపు వ‌రుస‌గా పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు మ‌రింత ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.దేశీయ చ‌మురు కంపెనీలు గ‌త కొన్నిరోజులుగా వ‌రుస‌గా పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి.తాజాగా లీట‌ర్‌ పెట్రోల్‌పై మ‌రో 29 పైస‌ లు,డీజిల్‌పై 24 పైస‌ల చొప్పున వ‌డ్డించాయి.దీంతో దేశ రాజ‌ధానిలో పెట్రోల్,డీజిల్‌ ధ‌రలు రికార్డు స్థాయికి చేరాయి.ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ రూ.94.23,డీజిల్ రూ. 85.15కు పెరిగాయి.ఇక ముంబైలో పెట్రోల్ రూ.100.47,డీజిల్ రూ.92.45గా ఉన్నాయి.భోపాల్‌లో పెట్రోల్ రూ.102.34,డీజిల్ రూ.93.37కు,కోల్‌క‌తాలో పె ట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు రూ.94.25, రూ.87.74కు చేరాయి.హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర రూ.97.93,డీజిల్ రూ.92.83గా ఉన్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here