వర్షాలతో..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాలువారుతున్న జలపాతాలు

కరీంనగర్:తొలకరి చినుకులు ప్రకృతి పులకరిస్తుంది.పచ్చని అందాలతో మనసుని రంజిపజేస్తుంది.ఇక వర్షాలతో ప్రకృతి ఒడిలోని ఎత్తైన కొండల్లోని జాలువారే జలపా తాలు,గలగాలపారే సెలయేళ్ళు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి.అప్పుడు అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.కొండకోనలోని ఎత్తైన కొండల మీ ద నుంచి వయ్యారి భామల దూకుతున్న జలపాతాలను చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక అందాలు ఉన్నాయి.కొద్దీ రోజులు గా వర్షాలు జోరందుకున్న నేపథ్యంలో ఉమ్మడి కరీం నగర జిల్లాలోని పలు జలపాతాలు నయగారాలను తలపిస్తూ కనువిందు చేస్తున్నారు.ఈ అందాలను ఆస్వాదిం చాలంటే కొంచెం చేరుకోవడానికి కష్టమైనా ఆస్వాధించడానికి యువత ఆసక్తి చూపిస్తుంది.ప్రఖ్యాతి గాంచకపోయినా అడవి అందాలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉం టాయి.ఆ జలపాతాలను సందర్శించడానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. . కరీంనగర్:జిల్లాలోని అందమైన జలపాతం రాయికల్‌ జలపాతం.ఇది సైదాపూర్‌ మండలంలో ఉంది.ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతం హొయలు ఒలికిస్తూ జాలువారుతోంది.18 గుట్టల పైనుంచి పడే వర్షపు నీటితో ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.సైదాపూర్‌కు 10కిలోవీుటర్ల దూరంలో ఉన్న ఈ జలపా తాన్ని సందర్శించడానికి హుజూరాబాద్,హుస్నాబాద్,ముల్కనూరు నుంచి దారులున్నాయి. జగిత్యాల: కోరుట్ల గోదావరి పరివాహక ప్రాంతంలో వేంపల్లి గుండం ఉంది.గోదావరి మూడు పాయలుగా చీలి కొంత దూరం పయనించి మళ్లీ రెండు పాయలుగా మారి ఇక్కడ కలుస్తుంది.బండరాళ్ల మీద నుంచి గోదావరి పయనిస్తూ జలపాతంగా మారింది.చూడడానికి ఎంతో సుందరంగా ఉంటుంది.కోరుట్లనుంచి గొర్రెపల్లి గ్రామం చేరు కోవడానికి పలు రహదారి మార్గాలున్నాయి. జగిత్యాల:జిల్లాలోని లొంక రామన్న జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది.కథలాపూర్‌ మండలం పోతారం గ్రామశివారులోని లొంక రామన్న జలపాతం ఉంది.దీనిని చూడడానికి వర్షాకాలంలో భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.ఈ జలపాతానికి చేరుకోవడానికి కోరుట్ల నుంచి వేములవాడ తో పాటు సిరిసిల్ల నుం చి కూడా దారులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఉన్న పాండవలోంక జలపాతం ఆకట్టుకుంటుంది.జాఫర్‌ఖాన్‌పేట సమీ పంలో పాండవలొంక జలపాతం ఉంటుంది.ఇక్కడ బండరాళ్లు పల్లపరుపుగా ఉండి వర్షం పడినప్పుడు నీరు ఏటవాలుగా అంచెలంచెలుగ కిందకి జారే అపురూప దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటాయి.పెద్దపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్,పా రుపెల్లి,ముత్తారం వెళ్లే బస్సులు,ఆటోల్లో కూనారం వెళ్లే దారిలో వెన్నంపల్లి మీదుగా జాఫ ర్‌ఖాన్‌పేటకు చేరుకోవచ్చు.ఇక్కడ జలపాతంతో పాటు శ్రీరాముడి పాదాలు, ఆంజనేయస్వామి గుడి,నాగదేవతలను దర్శించుకోవచ్చు పెద్దపల్లి జిల్లాలోని పేమస్ జలపాతం గౌరీ గుండాలు.ఇది వర్షం పడిన సమయంలో మంచి అందాలను సంతరించుకుంటుంది.దీంతో స్థానికులు ఎక్కువగా ఈ జలపా తాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.పెద్దపల్లినుంచి 13 కిలోమీటర్ల దూరంలో గౌరీగుండాలు జలపాతం ఉంది.అయితే ఈ సారి స్థానికులు గౌరీ గుండాల ను చూడడకి పర్యాటకులు రావొద్దు అంటూ స్తానికులు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here