మహనీయుల కలలను నిజం చేసేందుకే..వీఆర్‌ఎస్‌ తీసుకున్నాను: ఆర్‌ఎస్.‌ప్రవీణ్‌కుమార్

ఆదిలాబాద్:‌లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని,వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించారు.ఉ ట్నూర్‌ మండలం దంతన్‌పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు.మార్గమధ్యలో ముత్నూర్‌ వద్ద కుమ్రంభీం విగ్రహానికి,ఇంద్రవెల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్,మాన్యవార్‌ కాన్షీరాం,కుమ్రంభీం,పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్ప టికీ అసంపూర్తిగా ఉన్నాయని,వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు.వీఆర్‌ఎస్‌ ఒకరు చెబితే చేసింది కాదని,మనస్సాక్షిగా తీసుకున్న ని ర్ణయమని చెప్పారు.26 ఏళ్ల వృత్తిలో గిరిజన,దళిత,బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని,అది కేవలం ఒక శాతమేనన్నారు.మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు.పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని,ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.ఇలాంటి అభివృద్ధిని ప్ర తి గ్రామానికి,ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు.అక్షరం,ఆరోగ్యం,ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు.

Download RS Praveen Kumar Video 3GP MP4 HD - WapZeek.Viwap.Com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here