జిల్లాతో నా అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిది:కె.శశాంక

 

కరీంనగర్:కరీంనగర్ జిల్లా తో నా అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిదని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.కరీంనగర్ క్లబ్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కలెక్టర్ కే.శశాంక ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కే శశాంక మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తో తన అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిదని అన్నారు.అధికారులు.ప్రజా ప్రతినిధులు సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు.పరిపాల నలో అడుగులు వేసింది,రాటుదేలినది కరీంనగర్ జిల్లాలోనే అని అన్నారు.కరీంనగర్ జిల్లాలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు.జీవితం లో గుర్తుండిపోయే మధుర స్మృతులు,ఎన్నో అనుభూతులులకు వేదిక కరీంనగర్ అయిందన్నారు.జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల తోడ్పాటు,సహకారంతో జిల్లా అ భివృద్ధికి కృషి చేశానన్నారు.ఎలక్షన్స్ నిర్వహణ కోవిడ్ మహమ్మారి నియంత్రణ,పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలలో అధికారుల,ప్రజాప్రతినిధుల సహయ సహకా రం ఎంతో ఉందన్నారు.చారిత్రకంగా రాజకీయంగా గానే కాకుండా పరిపాలన పరంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ముందుండాలి అన్నారు.అధికారులు సౌకర్య వంతం గా జిల్లా యంత్రాంగం పని చేయగలుగుతుంది అన్నారు.గొప్ప అనుభూతులు అనుభవాలను కరీంనగర్లో పొందడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమ అగర్వాల్.ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్,కరీంనగర్ ఆర్డిఓ ఆ నంద్ కుమార్ జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీధర్,టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here