ఇవి తినండి..కరోనా నుండి బయటపడండి..

హైదరాబాద్:కరోనా ఎప్పుడు పోతుందని జనాలు అనుకుంటున్నారు.ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.తిండి నుంచి మొ దలుకుని రోజు వారి అలవాట్లను మార్చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని వై ద్యులు నిపుణులు సూచిస్తున్నారు.అందులో భాగంగా తినే తిండి విషయంలో జాగ్రత్తలు అవసరమని వెల్లడిస్తున్నారు.చాలామంది సరైన ఆహారం తీసుకోవడం లేదని ఇమ్యూనిటీ బూస్టర్లు కషాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం కరెక్టు కాదంటున్నారు.వైరస్ సోకినా సోకలేని వారు ప్రోటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం బెటర్ అని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ లక్ష్మయ్య వెల్లడిస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి రోజూ పండ్లు (100 నుంచి 150 గ్రాములు)కూరగాయాలు (250 గ్రాముల నుంచి 300 గ్రాములు) మొత్తం కలిపి 400 గ్రాములు తీసుకోవాలి.ఇవి కాకుండా రోగ నిరోధ క శక్తిని పెంచే డ్రైప్రూ ట్స్‌ నట్స్‌ మొదలైనవి ఎక్కువగా తినాలి.పప్పు దినుసులు చేపలు చికెన్‌ మటన్‌ ఇతర మాంసాహారాల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయనే సంగతి తెలి సిందే.అంతేగాకుండా పాలు పెరుగు గుడ్లు కూడా తీసుకోవచ్చని డాక్టర్ లక్ష్మయ్య తెలియచేస్తున్నారు.ఇక కరోనా వైరస్ బారిన పడిన వారు ఏం మాత్రం భయపడకుం డా ఎక్కువ మోతా దులో ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటే సరిపోతుందంటున్నారు.రోజుకు 60 గ్రాముల పప్పు తింటే కావాల్సిన ప్రొటీన్లు శరీరానికి అందుతాయని వైరస్‌ సోకిన వారైతే 60 నుం చి 100 గ్రాముల మధ్యలో తింటే మంచిదని వెల్లడిస్తున్నారు.పండ్లు ఆకుకూరలు కూరగాయాలు పోషక ధాన్యాలు తృణధాన్యాలు పప్పులు పెరు గు పాలు నట్స్‌ అం డ్‌ సీడ్స్‌ ప్యాట్స్‌ అండ్‌ ఆయిల్స్‌ తినే ఆహారంలో కచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి.ఇందులో విటమిన్లు మినరల్స్‌ ఉంటాయి.ఇక పండ్లు కూరగాయాల్లో ఆంటీ యాక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వైరస్‌ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడుతాయని సూచించారు.ఆపిల్‌ ఒక్కటే కాకుం డా గువా (జామకాయ) తీసుకోవచ్చు.జామ ధర కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే.ఇందులో చాలా విటమిన్లు మినరల్స్‌ ఉంటాయి.బాదం పిస్తాలతో పోలిస్తే కంది పెసరపప్పులోనూ మంచి ప్రొటీన్స్‌ ఉంటాయి.ప్రోటీన్స్ తో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు శరీరాన్ని కాస్త శ్రమ పెట్టాల్సి ఉంటుందని ఇందుకు యోగా వ్యా యామం లాంటి ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం చాలా ముఖ్యమన్నారు.డయాబెటిస్‌ ఒబేసిటీ హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు సాధారణ ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం అవసరం.దీని ద్వారా ఉపశమనంతో పాటు వారికి కావాల్సిన రోగ నిరోధక శక్తి లభిస్తుందన్నారు.వంటింట్లో ఉండే పసుపు అల్లం లవంగాలు దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా ఇ మ్యూనిటీ పెరుగుతుంది.అయితే కషాయాలు చేసుకొని తాగడం మంచిది కాదని డాక్టర్ లక్ష్మయ్య తెలియచేశారు.డయాబెటిస్‌ బీపీ లాంటి ఆరో గ్య సమస్యలున్న వా రు విటమిన్‌లు ఏ సీ బీ పొటాషియం ఉండే బొప్పాయి ఆపిల్‌ గ్రేప్స్‌ మ్యాంగో తినడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here