భారత్ లో కరోనా మరణ మృదంగం..ఒక్కరోజే 3వేల 645 మంది మృతి

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.మరోసారి 3లక్ష లకు పైగా కేసులు 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుం ది.ఇక 3లక్షల 79వేల 257 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524 కి చేరింది.కరోనాతో ఇప్పటివరకు చనిపో యిన వారి సంఖ్య 2,04,832 కి పెరిగింది.దేశంలో ప్రస్తుతం 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2లక్షల 69వేల 50 7మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక్కటే సానుకూలాంశం.ఇప్పటివరకు కోటీ 50లక్షల మంది వైరస్ ను జయించారు.ఈ మే రకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.నిత్యం లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తుం డటం ఆందోళనకు గురి చేస్తోంది.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.ప్రజలు తప్పకుం డా కరోనా నిబంధలు పాటించాలని మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం కోరుతోంది.తెలంగాణలో కరోనా విలయతాం డవం:తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది.భారీగా కేసులు మరణాలు నమోదవుతున్నాయి.తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.మరో 58మంది కరోనాకు బలయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏప్రిల్ 29,ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4వేల 9మంది కోలుకున్నారు.రాష్ట్రంలో 76వేల 60 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 1630 కేసు లు ఉన్నాయి.ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 27 వేల 960కి పెరిగింది.రికవరీ రేటు మరింత తగ్గి 81.71 శాతంగా నమోదైంది.రా ష్ట్రంలో ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 3 లక్షల 49 వేల 692.కొత్తగా నమోదైన మరణాలతో కోవిడ్,తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 2 వేల 208 కి పెరిగింది.మేడ్చల్ మల్కాజ్ గిరి లో 615,రంగారెడ్డి జిల్లాలో 558,నల్గొండ జిల్లాలో 424,సంగారెడ్డి జిల్లాలో 337,నిజామాబాద్ లో 301 కోవిడ్ కేసు లు నమోదయ్యాయి.పలు జిల్లాల్లో 200లకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here