బీజేపీ ఎంపీ దొడ్డిదారిలో..10వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు..

ముంబై:కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో కొత్త కేసులు మరణాలు భారీగా నమోదవుతూ ఆస్పత్రులన్నీ కిక్కిరిసి అత్యవసర మందుల కొరత ఆక్సిజన్ కొర త కొనసాగుతుండగా అధికార బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఎంచక్కా దొడ్డిదారిలో మందులు దక్కించుకుని తమ ప్రైవేటు ఆస్పత్రుల్లో విక్రయించుకోవడం వివాదాస్పదమైంది.మహారాష్ట్ర బీజేపీ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ సూత్రధారిగా వెలుగుచూసిన అక్రమ వ్యవహారంపై బాంబే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.దేశంలో కొవిడ్ ప్రోటోకాల్ అమలవుతూ అత్యవసర మందుల్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తం లో ఇంజెక్షన్లు ఎలా వెళుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.దీనికి వెంటనే సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రంలోని మోదీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.అహ్మద్ నగర్ బీజేపీ ఎంపీ సుజయ్ పాటిల్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ ప్రైవేటు విమానంలో 10వేల డోసుల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను తెప్పించుకున్నారు.ఢిల్లీలో తన కున్న పలుకుబడిని ఉపయోగించి మందులు తెప్పించానన్న ఆయన వాటిలో కొన్నిటిని స్థానిక సాయిబాబా ఆస్పత్రికి మరికొన్నిటిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపిణీ చేసి మిగతా డోసులను తన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ఎంపీ సుజయ్ మాదిరిగానే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగత హోదాలో అత్యవసర మందుల్ని తెప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ వివాదంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.అక్రమంగా మందులు తరలించిన ఎంపీని అరెస్టు చేయాలని అత్యవసర మందుల పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలంటూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ గిరీశ్ కులకర్ణి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.ఒకరిద్దరు రాజకీయ నేతలతోపాటు కొద్ది మంది బడా బాబులు నేరుగా అత్యవసర మందులు పొందుతోన్నట్లు కోర్టు దృష్టికి వ చ్చిందని ఒకవేళ ఎవరికి పడితే వారికి మందులు ఇచ్చే వ్యవస్థ ఉన్నట్లయితే వెంటనే దాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here