ఇవి తాగండి..బానపొట్టకు..బై చెప్పండి

కరీంనగర్:ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.ఆరోగ్యం కోసం వ్యాయామాల దగ్గర నుంచి లైఫ్ స్టయిల్ లో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు. చాలామందిలో ఎక్కువగా కనిపించే సమ స్య బెల్లీ ప్యాట్ ఎన్ని కసరత్తులు చేసినా బానపొట్ట తగ్గడం లేదని బాధపడిపోతుంటారు.పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా తొందరగా బానపొట్టకు బాయ్ బా య్ చెప్పేయొచ్చు అంటున్నారు.తొందరగా బరువు తగ్గాలనుకునేవారు సరైన పద్ధతిలో ఫాలో అయితేనే బానపొట్టను ఇట్టే తగ్గించుకోవచ్చు.అయితే మీరు చేయా ల్సిందిల్లా జిమ్ లెకెళ్లి కసరత్తులు చేయక్కర్లేదు సింపుల్ గా మీరు తినే ఫుడ్ డ్రింక్ అలవాట్లను కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేందు కు ఈ రోజు నుంచే గోరువెచ్చని పానియాలను తాగడం ప్రారంభించండి.బానపొట్ట తగ్గడమే కాదు గోరువెచ్చని పానియాలతో మెటాబాలిజం కూడా బాగా మెరుగుపడు తుంది.మొండి బానపొట్టకు గుడ్ బై చెప్పాలంటే ఈ 5 రకాల హెల్తీ డ్రింకులను ఓసారి ట్రై చేయండి.గోరువెచ్చని నీటిలో నిమ్మ,తేనె డ్రింక్:గోరువెచ్చని నీటిలో నిమ్మ కాయ కలిపిన డ్రింక్ తాగితే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.తొందరగా బరువు తగ్గిపోవచ్చు.యాంటీయాక్సిడెంట్స్,పెక్టిన్ ఫైబర్,విటమిన్ సిలతో డ్రింక్ తాగితే శరీరంలోని విషవ్యర్థాలన్ని బయటకు వెళ్లిపోతాయి.తద్వారా మెటాబాలిజం మెరుగుపడుతుంది.జీర్ణశయ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.క్రమంగా బానపొ ట్ట తగ్గిపోతుంది.మెంతుల డ్రింక్: ఇందులో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి.బరువు తగ్గడంతో పాటు రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు. లివర్ ఆరోగ్యంతో పాటు మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు.మెంతులు శరీరంలో వేడిని పుట్టించి కొవ్వు కరిగేలా చేస్తాయి.ఉదయాన్ని లేవగానే పరిగడుపన మెంతులను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.బరువు తొందరగా తగ్గించుకోవచ్చు.జీలకర్ర నీళ్లు:జీర్ణ ప్రక్రియతో పాటు మెటాబాలిజాన్ని కూడా మెరుగుపరుస్తుంది.తక్కువ స్థాయిలో కేలరీలు ఉంటాయి.ఆకలిని అదుపులో ఉంచుతుంది.తొందరగా కొవ్వును కరగదీస్తుంది.ఖాళీ కడుపు తో ఈ జీలకర్ర పానియాన్ని తీసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.గ్రీన్ టీ,పుదీనా టీ:గ్రీన్ టీ పుదీనా ఆకులలో యాంటీయాక్సిడెంట్స్ పోషక విలువలు అధికంగా ఉంటాయి.మీ బరువును తొందరగా తగ్గించుకోవడంలో ఈ ఇంగ్రిడీయంట్స్ బాగా పనిచేస్తాయి.జీర్ణశయ ఎంజైమ్స్ ఉత్తేజపరుస్తాయి.పుదీనా ఆకుల పాని యంతో శరీరంలోని కొవ్వును కరిగించి శక్తిగా మారేలా చేస్తుంది.గ్రీన్ టీ కూడా కొవ్వను కరిగేలా చేస్తుంది.మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది.యాంటీమైక్రోబియా ల్,యాంటీవైరల్ పోషకాలను కలిగి ఉంటుంది.అల్లం,నిమ్మకాయతో పానియం:అద్భుతంగా పనిచేస్తుంది.కిలోల బరువును ఇట్టే తగ్గించగలదు.యాంటీబ్యాక్టిరీయల్, యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ,యాంటీయాక్సిడెంట్ పోషక విలువలు అధిక స్థాయిలో ఉంటాయి.బెల్లీ ప్యాట్ తొందరంగా తగ్గాలనుకునే వారికి ఈ పానియాన్ని ఎక్కువగా వాడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here