న్యూఢిల్లీ:ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ముఖేష్ అంబానీ అదానీల వ్యాపారాల్లో ఏమీ మార్పులు రావటం లేదు.అప్పట్లో యూపీఏ ప్రభుత్వమైనా ఇఫ్పటి ఎన్డీ యే ప్రభుత్వమైనా ఒకటే పద్దతి. అదేమిటంటే అంబానీ అదానీలు చెప్పినట్లు వినటమే.ఎందుకంటే పార్టీలు నడపటానికి అవసరమైన నిధుల కోసం పై ఇద్దరు కార్పొరే ట్లపైనే ఆధారపడ్డాయి కాబట్టి.ఒకవైపు ఇండియా పేద దేశమని అంటున్నారు.అదే సమయంలో పై ఇద్దరితో పాటు అనేకమంది కార్పొరేట్ల సంపద అంతకంతకు పెరిగి పోతోంది.అంబానీ అదాని సంపద ఇన్ని లక్షల కోట్లని ఒక్కరోజులో వీళ్ళ సంపది ఇన్ని వేల కోట్లు పెరిగిందని లెక్కలు చెబుతుంటారు.మరి వాళ్ళ సంపదపై ఆదాయ పు పన్నుశాఖ ఉన్నతాధికారులు ఏరోజూ దాడులు జరిపిన దాఖలాల్లేవు.మామూలు వ్యాపారులపైన దాడులు జరిపే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరి వీళ్ళిద్దరి ఆస్తులు వ్యాపారాలపై ఎందుకని దాడులు చేయటం లేదు.వాళ్ళు సక్రమంగా ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? కడితే ఎంత కడుతున్నారు ? అనే వివరాలను దేశ ప్రజలకు ప్రభుత్వాలు ఎందుకని చెప్పటం లేదు.వీళ్ళిద్దరి ఆస్తులు రోజురోజు పెరుగుతున్నాయే కానీ ఏరోజు కూడా తగ్గకపోవటం గమనార్హం.మనదేశంలో పేదలు మ రింత పేదలుగా మారిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో అంబానీ అదానీ లాంటి వాళ్ళ సంపదా రోజు రోజుకు పెరిగిపోతోంది.అంటే సంప న్నులు-పేదల మధ్య వ్యత్యాసం ప్రతిరోజు పెరిగిపోతోందని అర్ధమవుతోంది.మరి ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఏ ప్రభుత్వమూ కృషి చేసినట్లు కనబడదు.వీళ్ళ ఆస్తు లు 500-600 శాతం పెరిగినట్లు ప్రచారం జరగటమే కానీ ఆ సంపదపై వాళ్ళు సరిగా పన్నులు కడుతున్నారా లేదా అని చెప్పేవాళ్ళు కూడా లేరు.కాబట్టే ప్రభుత్వా లు ఏవైనా వీళ్ళ సంపద మాత్రం పెరుగుతునే ఉంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...