కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

హైదరాబాద్:తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.వరంగల్,ఖమ్మం,మహబూబ్‌నగర్ ఓట్ల లెక్కిం పు నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది.ముందుగా 25 ఓట్లు చొప్పున బ్యాలెట్ కట్టలు కడుతున్నారు.ఈ ప్రక్రియ రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.ఇక్కడ గత ఎన్నికల్లో 53శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు భారీగా 70 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.టీఆర్ఎస్ నుంచి సి ట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రాముల్ నాయక్,బీజేపీ నుంచి పేమేంద్రరెడ్డి పోటీ పడ్డారు.టీజేఎస్ నుంచి కోదండరామ్,వామప క్షాల నుంచి జయసారధి రెడ్డి పోటీ చేశారు.యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమదేవి,ఇండిపెండెంట్‌గా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు.కౌంటింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది.సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు.లెక్కింపునకు మొత్తం 8 హాళ్లు వినియోగించనున్నారు.ఒక్కో మాల్‌లో 7 టేటుల్స్‌ చొప్పున 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో 3,57,354 ఓట్లు పోలయ్యాయి.మూడు షిఫ్టుల్లో అధికారులు సిబ్బంది పనిచేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here