ఎంపీ అర్వింద్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి..!

నిజామాబాద్:నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు పసుపు రైతులు.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్ర భుత్వం స్పష్టం చేయడంపై పసుపు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన రైతులు ఆయన రాజీనామా చేయాల్సిందే నని డిమాండ్ చేశారు.పసుపు బోర్డు తేలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులు,ప్రజల పక్షాన పోరాడుతానని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన అరవింద్ ఇ ప్పుడు ఆ పనిచేయాలన్నారు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ.సాగర్‌ అరవింద్ గెలిచి రెండేండ్లయినా పసుపు బోర్డు తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.రాష్ట్రంలో లక్షా 40 వేల ఎకరాల్లో పసుపు సాగు అవుతున్నదని రైతులు ఎగుమతి చేయగలిగే నాణ్యమైన పసుపు పండిస్తున్నారని చెప్పారు.అయినా మద్దతు ధర లభించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పసుపు బోర్డు ద్వారా తప్పనిసరిగా మద్దతు ధర లభిస్తుందని రైతులు భావిస్తున్నారని కానీ అలా జరగలేదన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here