నేడు కొండకొట్టు కు ఎమ్మెల్సీ కవిత..అందుకేనా..?

జగిత్యాల:తెలంగాణలో నేటి నుంచి అఖండ అనుమాన్ చాలిసా పారాయణ కార్యక్రమం ప్రారంభం కానుంది.జగిత్యాల జిల్లా కొండకొట్టు అంజన్న ఆలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.హనుమాన్ ఆలయంలో రామకోటి పుస్తకాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.అనంతరం హనుమాన్ చాలిసా పారాయణం ఉంటుంది.కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు పలువురు నేతలు పాల్గొంటారు.ఇవాళ్టి నుంచి కొండగట్టు తో పాలు తెలంగాణవ్యాప్తంగా ఉన్న 3,200 హనుమాన్ ఆలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.రాష్ట్రవ్యాప్తంగా 80 రోజుల పాటు హనుమాన్ చాలిసా పారాయణం ఉంటుంది.పెద్దహునుమాన్ జయంతి (జూన్ 4)న ముగుస్తుంది.అన్ని ఆలయాల్లో సాయంత్రం 05.30 నుంచి 06.30 వరకు హనుమాన్ చాలిసా పారాయణం చే స్తారు.ఇందుకోసం అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా,ఎమ్మెల్సీ కవితన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల కాశీ తీర్థయాత్రలకు వెళ్లా రు.అక్కడ పూజారులు రామకోటి స్తూపం ఎంతో మహిమ గలదని నేపాల్‌తో పాటు మన కాశీ దివ్యక్షేత్రాలలో మాత్రమే రామకోటి స్తూపం ఉందని కవితకు చెప్పినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మార్చి 9న ఆమె కొండగట్టుకు వెళ్లి రామకోటి స్తూపానికి ఉత్తరద్వారంలో భూమి పూజచేశారు.బీజేపీ జైశ్రీరామ్ నినాదంతో దూసుకెళ్తోంది. ఇటీవలే రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు చేపట్టారు.ఊరూరా జైశ్రీరామ్ నినాదం మోర్మోగింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో రామనామాన్ని జపా న్నే జపిస్తోంది బీజేపీ.అదే నినాదంతో తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.ఇప్పటికే దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టింది.ఈ క్రమంలో బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదాన్ని అందుకుందనే ప్రచారం జరుగుతోంది.అందుకే హను మాన్ చాలిసా పారాయాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరినీ భాగస్వా మ్యం చేయాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here