అసలు..పీఆర్సీ,ఫిట్‌మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?

హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా ప్రకటించారు.అసలు ఇంతకీ పిఆర్సీ,ఫిట్ మెంట్ అంటే ఏమిటి? వీటి వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు తెలుసా?పీఆర్సీ అంటే వేతన సవరణ కమిటీ.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు,పదవీ విరమణ పొంది ఫించన్ అందుకునే వారికి నిర్ణీత కా లం తర్వాత వేతనాలను సవరిస్తారు.అయితే వారికి ఎంత జీతం ఇవ్వాలి? అలవెన్సులు(భత్యం) ఎంత ఇవ్వాలి అనే విషయాలను పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచి స్తుంది.ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.ఈ కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా వేతనాల పెంపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.అయితే ఈ నివేదిక ఆధారంగానే జీత భత్యాలు పెంచాలనే నిబంధన ఏమీ ఉండదు.నిజానికి కమిటీ సూచించిన దానికన్నా ఎ క్కువనే ప్రభుత్వాలు చెలిస్తుంటాయి.ఇక ఫిట్ మెంట్ విషయానికొస్తే నిత్యావసరాల ధరలు,ఇతర ఖర్చుల ఆధారంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు జీతాల పెం పు ఉంటుంది.దీనినే ఫిట్ మెంట్ అంటారు.వేతన సవరణలో భాగంగా పెరిగిన జీతాలకు ఫిట్ మెంట్ ను కూడా కలిపి చెల్లిస్తుంది ప్రభుత్వం.కేంద్ర ఉద్యోగులకు పదేళ్లకు ఒకసారి,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకు ఒకసారి వేతనాల్లో సవరణలు ఉంటాయి.ఉద్యోగికి అప్పటి వరకు ఉన్న డీఏను,ఫిట్ మెంట్ గా చెల్లించే మొత్తాన్ని కలు పుకుని కొత్త మూలవేతనాన్ని నిర్దారిస్తారు.అందుకోసం ఒక నిర్దిష్టమైన పే స్కేల్ ఉంటుంది.దీనికి ఇతర అలోవెన్సులను కూడా జోడించి నెల జీతాన్ని చెల్లిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here