ఇక్కడ..దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా..?

ఔరంగాబాద్: ఇక్కడ దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా? అనే ప్రశ్నకి వుంటుంది అనే సమాధానం మనకి మహారాష్ట్ర శనిశింగణాపూర్ లో వినిపిస్తుంది.ప్రాణం వుండ టం వల్లనే అక్కడ శనిదేవుడిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు.స్వామివారు ఇక్కడ ఆవిర్భవించిన తీరును గురించి తెలుసుకుంటే,వాళ్ల మాటల్లో నిజం ఉందనే విషయం అర్థమవుతుంది.పూర్వం ఈ ప్రాంతానికి వరదలు సంభవించినప్పుడు అయిదు అడుగులపైనున్న ఒక నల్లని బండరాయి కొట్టుకుని వచ్చి ఒక చెట్టు మొదట్లో ఆగిం దట.వరద తగ్గుముఖం పట్టినతరువాత ఆ రాయిని కొంతమంది పశువుల కాపర్లు చూశారట.ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఆ రాయిపై ఒకతను ముల్లుగర్రతో పొడిచా డట అంతే అక్కడి నుంచి రక్తం ధారగా కారసాగింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకు వచ్చి ఆ వైనాన్ని ప్రత్యక్షంగా చూశారు.ఆ బండరాయిని కదిలించ డానికి ప్రయత్నించి విఫలమయ్యారు.ఆ రాత్రి శనీశ్వరుడు ఓ భక్తుడి కలలో కనిపించి శిలారూపంలో ఆ ఊరుకి వచ్చింది తానేనని చెప్పాడట.తనని ఫలానా వ్యక్తులు మాత్రమే కదిలించాలనీ ఫలానా ప్రదేశంలో ప్రతిష్ఠించాలని ఆదేశించాడు.గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆ భక్తుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడట.మహిమాన్వి తమైన ఈ సంఘటనను గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు.శిలా రూపంలో స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ ఈ గ్రామానికి సంబంధించి న రక్షణ అంతా కూడా ఆయనే చూసుకుంటూ వుంటాడని భక్తులు భావిస్తుంటారు.అందువలన ఇక్కడ దొంగతనాలు వంటివి జరగవు స్వామిపై గల విశ్వాసంతో త లుపులకి తాళాలు వేయరు.ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేసి దొంగతనానికి ప్రయత్నించిన వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించిన దాఖలాలు ఎన్నో కనిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here