ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?

న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని అమాయక ప్రజలు నమ్మారు.రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.ముందునుంచి మోడీ సర్కార్ ఏంచేయాలని ప్రణాళిక రచించుకుందో దాన్ని అమలు చేయడం ప్రారం భించింది.ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తున్నామంటూ అస్మదీయులకు కట్టబెట్టేస్తోంది.రెండోదఫా అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం ప్రారంభించింది.నష్టాల్లో ఉన్నాయని,వాటిని నడపడంవల్ల ప్రభుత్వానికి భారమేకానీ ఎటువంటి ఉపయోగం ఉండదని స్పష్టం చే శారు.బీఎస్ఎన్ఎల్‌,విశాఖ ఉక్కు కర్మాగారం,తర్వాత బీహెచ్ఈఎల్‌,కోల్ ఇండియా ఇలా అన్నింటినీ ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు.విమర్శలు వ స్తున్నా ఉద్యమాలు జరుగుతున్నా ఎటువంటి స్పందన ఉండటంలేదు.అవసరమైతే ప్రజలగొంతు నొక్కి మరీ ప్రయివేటుకు ధారాదత్తం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నా రు.పారిశ్రామిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడం కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందనే విమర్శలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి.ప్రభుత్వ రం గం సంస్థలను అమ్మడంలో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తోంది.దేశాన్ని రెండుగా విభజించారు.దక్షిణ భారతదేశాన్ని అదానీకి,ఉత్తర భారతదేశాన్ని ముఖేష్ అంబానీకి కట్టబెట్టే ప్రయత్నమంటూ ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే వ్యూహంలో భాగమే నూతన వ్యవసా య చట్టాలంటూ రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.ప్రభుత్వ రంగ సంస్థల వాస్తవ విలువలో 25-30 % విలువకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుండడం ప్రశ్నిం చే వాళ్ల గొంతు నొక్కేయడం మోడీ ప్రభుత్వానికి రివాజుగా మారిపోయిందంటూ విభిన్న వర్గాల నుంచి ఆరోపణలొస్తున్నాయి.దీన్ని అడ్డుకోకపోతే అన్ని ప్రభుత్వ ఆస్తు లు,ప్రభుత్వ రంగ సంస్థలు వాటి అధీనంలో ఉన్న విలువైన భూముల కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు.ప్రజల్లో చైత న్యం తెచ్చి ఉద్యమం చేయడమొక్కటే దీనికి పరిష్కారమంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here