ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

అమరావతి:ఈ నెలాఖరుతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనుండగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎస్ఈసీ నియమితులు అయ్యారు.అందరూ ఊహించినట్టుగానే మాజీ సీఎస్ నీలం సాహ్నినిని కొత్త ఎస్‌ఈసీగా నియమించారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాహ్నికి ఈ అవకాశం కల్పించారు.సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు నీలం సాహ్ని ఇక ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నిని ఆమె పదవీకాలం ముగియడం తో సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే.ఇక మొత్తం ముగ్గురి పేర్లు ప్రతిపాదించగా గవర్నర్ నీలం సహానీకి అవకాశం దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here