కొవిడ్-19 కేసులెక్కువైనా..విమానాలు రద్దు చేయం:హర్దీప్ సింగ్ పూరీ

న్యూఢిల్లీ:దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమాన యానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.మలి విడుత కేసులు పెరుగడం వల్లే దేశవ్యాప్తంగా 100 శాతం విమాన సర్వీసులు నడుపలేకపోతున్నామ న్నారు.ప్రస్తుత పరిస్థితులు ప్రజలు ప్రయాణించడానికి సేఫెస్ట్ మోడ్ విమాన ప్రయాణమేనని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.కరోనా మార్గదర్శకాలను,నిబంధనలను పా టించని వారిపై సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నాయని చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ విమానాశ్రయం టర్మినల్ విస్తరణ వల్ల దేశంలో అభివ్రుద్ధి చెం దుతున్న 2-3 శ్రేణి విమానాశ్రయాల్లో గోరఖ్‌పూర్ ఒకటిగా నిలుస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే మే నాటికి పూర్తి కావచ్చునని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.ఎయిర్ ఇండియా ఇప్పటికీ రూ.60 వేల రుణాల ఊబిలో చిక్కుకున్నదని,ఈ పరిస్థితుల్లో దాన్ని విక్ర యించక తప్పడం లేదని తెలిపారు.దీంతోపాటు మరో పీఎస్‌యూ విమానయాన సంస్థ పవన్ హన్స్ వంటి సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here