చెంచులపై దాడా?హరగోపాల్‌

హైదరాబాద్‌:నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా వద్ద ఈ నెల 26న చెంచులపై దాడి ఘటన పై సమగ్ర నివేదికను సమర్పించడంతోపాటు ఏప్రిల్‌ 26న నేరుగా తమ ఎదుట హాజరుకావాలని నాగర్‌కర్నూల్‌ డీఎ్‌ఫవోను ఆదేశించింది.ఈ ఘటనపై తెలంగాణ గిరిజ న సంఘం మంగళవారం హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసింది.24 మంది బాధితుల్లో కొందరి తలలు పగిలాయని కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది.ఈ దాడిపై న్యాయవిచారణ జరిపించాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here