హైదరాబాద్:టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.సాగర్ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు.కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి,రవికుమార్ (ఎస్టీ వర్గం)కు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో అంజయ్య మనస్తాపానికి గురయ్యారు.ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
