ఇదీ..రైతు సంఘాల భవిష్యత్తు కార్యాచరణ

న్యూఢిల్లీ:కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు తెలి పారు.ఏప్రిల్‌ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24గంటల పాటు బ్లాక్‌ చేయనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు బుధవారం సాయంత్రం వెల్లడించారు.సా గు చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలు మే నెల ప్రథమార్థంలో పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టా లని నిర్ణయించారు.అయితే ఈ మార్చ్‌ ఏ రోజు నిర్వహించేది మాత్రం త్వరలోనే వెల్లడిస్తామన్నారు.పార్లమెంట్‌ మార్చ్‌లో రైతులతో పాటు కార్మికులు మహిళలు దళి తులు ఆదివాసీలు బహుజనులు నిరుద్యోగ యువత పాల్గొంటారని తెలిపారు.పూర్తి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపారు.ఈ మా ర్చ్‌లో పాల్గొనేందుకు నిరసనకారులంతా సింఘూ టిక్రీ ఘాజీపూర్‌ ప్రాంతాలకు వాహనాల్లో చేరుకుంటారని అక్కడినుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్తారని పేర్కొన్నా రు.ఈ చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం ఆగదని నేతలు స్పష్టంచేశారు.భవిష్యత్తు కార్యాచరణ ఇదే.ఏప్రిల్‌ 5న దేశంలోని ఎఫ్‌సీఐ కార్యాలయాల ముట్టడి,ఏప్రిల్‌ 10న కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వే 24గంటల పాటు దిగ్బంధం,ఏప్రిల్‌ 13న వైశాఖీ పండుగను దిల్లీ సరిహద్దులో జరపాలని నిర్ణయం,ఏప్రిల్‌ 14న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహణ,మే 1న కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని రైతులకు పిలుపు.సుప్రీంకు నివేదిక సమర్పించిన కమిటీ మరోవై పు,సాగుచట్టాలకు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ తన నివేదికను సమర్పించింది.సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు మార్చి 19న ఈ నివేదికను షీల్డ్‌కవర్‌లో అందజేశారు.తదుపరి విచారణలో ఈ నివేదిక బహిర్గతంకానుందని కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ తెలిపారు.తమ పాత్ర ముగిసిందని ఈ నివేదిక బయటకు రాకుం డా ఏదీ మాట్లాడలేమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here