తిరుపతి:కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చో టు చేసుకుంది.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటిం చారు.మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు.సోమవారం రాత్రి 8:15 నుంచి 8:30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు తెలిపారు.దాదాపు 1000 మందికి చికిత్స జరుగుతోందన్నారు.ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.దీంతో ఐసీయూలోని బాధితులు ఊపిరాడక అల్లాడారు.అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యు లు సీపీఆర్ చేశారు.బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు అట్టముక్కలతో విసిరారు.అయినా ఆక్సిజన్ అందక 11 మంది కన్నుమూశారు.తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...