షరతులతో..పుట్ట మధును వదిలిపెట్టిన పోలీసులు

పెద్దపల్లి/మంథని:లాయర్ వామన్‌రావు దంపతుల హత్యకేసులో టీఆర్ఎస్ నేత,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును మూడు రోజులపాటు పోలీసులు విచారించారు. పుట్టా మధు భార్య,మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజను,మార్కెట్ కమిటీ చైర్మన్ వూదరి సత్యనారాయణను కూడా పోలీసులు విచారించారు.మూడు రోజు ల విచారణ తరువాత నిన్న అర్ధరాత్రి ఆయనను ఇంటికి పంపించారు.తిరిగి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు పుట్టా మధుకు సూచించారు. కాగా మూడు రోజుల విచారణలో పుట్టా మధుకు సంబంధించిన ప్రతిదీ ఎంక్వయిరీ చేశారు.మరి ముఖ్యంగా ఆయన బ్యాంకు ఖాతాలతో పాటు బంధుమిత్రుల ఆస్తి వ్య వహారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ కేసులో రూ.2 కోట్ల వ్యవహారమే కీలకమని పోలీసులు భావిస్తున్నారు.వామనరావు దంపతుల హత్య జరగడానికి ముందు బ్యాంకు నుంచి ఉపసంహరించిన రూ.2 కోట్లు ఎవరెవరి చేతులు మారాయనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు ఈ విచారణపై పోలీసులు ఏ విధమైన వివరణ ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here