తెలంగాణ సర్కార్‌కు జూనియర్ డాక్టర్ల అల్టిమేటం

హైదరాబాద్:దేశంతో పాటు తెలంగాణను కరోనా కలవరపెడుతోంది.కరోనా కారణంగా రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య రంగాలపై ఎన్నడూ లేనంత ఒత్తిడి ఉంది.ఈ ఒత్తడిని త ట్టుకునేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది.ఈ క్రమంలోనే ప్రభుత్వానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది.తమ డి మాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.గతంలో ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా 15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు.దీంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని స్ప ష్టం చేశారు.కోవిడ్ డ్యూటీలు చేసే ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారిన పడితే నిమ్స్ లో వైద్యం అందించేలా గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చే స్తున్న చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారని వారిని అదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపి స్తున్నారు.జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా పరిస్థితిని ఎ దుర్కొనేందుకు మూడు నెలల కాలానికి 50 వేల మంది మెడికల్ సిబ్బందిని నియమించుకోవాలని డిసైడయిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కసరత్తు ము మ్మరం చేసింది.వారికి గౌరవప్రదమైన వేతనాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్ సర్కార్ తాజాగా వారికి ఏ మేరకు వేతనాలు ఇవ్వబోతున్నామనే విషయం లో క్లారిటీ ఇచ్చింది.కొత్తగా నియమించుకునే వారిలో ఎంబీబీఎస్ చేసిన వారికి రూ.40 వేలు ఇవ్వబోతున్నారు.ఇక మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుకు రూ.లక్ష ఇవ్వా లని నిర్ణయించారు.ఆయూష్ డాక్టర్లకు రూ.35 వేల,స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు,ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.ఇక ఈ తాత్కా లిక ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here