హైదరాబాద్:కరోనా మహమ్మారి కట్టడిపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది.రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ కానుం ది.రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలా?లేక కఠిన ఆంక్షలతో కర్ఫ్యూనే అమలు చేయలా?అనే విషయంపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే వచ్చే సమస్యలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.దీంతోపాటు మంత్రివర్గ విస్త రణ,రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.