నేడు గాయని సునీత పుట్టిన రోజు

హైదరాబాద్:ఈరోజు సింగర్ సునీత పుట్టినరోజు.సింగర్ సునీత ఈమె అసలు పేరు ఉపద్రష్ట సునీత.ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే తన అద్భుత మైన గానామృతంతో అందరిని మైమరిపించేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈమె పాడిన ఎన్నో పాటలకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి.అంతేకా కుండా అతి చిన్న వయసులోనే నేషనల్ అవార్డు పొందిన గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది.ఈరోజు సింగర్ సునీత పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆమె సాధించిన అవార్డులు రివార్డులు గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.సునీత ఉపద్రష్ట నరసింహారావు సుమతి దంపతులకు మే 10 1978 న గుంటూరు లో జ న్మించింది.ఈమె మేనత్త చిన్నమ్మ సంగీత పాఠాలు చెప్పేవారు.అంటే వీరి కుటుంబం లోనే కొన్ని తరాలుగా సంగీతం వస్తోంది.ఇక ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊ రు గుంటూరు లోనూ మరికొంతకాలం విజయవాడలో జరిగింది చిన్ననాటినుండే సునీతకు సంగీతం మీద అనురక్తి ఉండడంతో విజయవాడలోని సంగీత ద్రష్ట పెమ్మ రాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోనూ కలగా కృష్ణమోహన్ దగ్గర లలిత సంగీతంలో ఎనిమిది సంవత్సరాలపాటు శిక్షణ పొందింది.ఇక గురువు గారితో పాటు త్యాగరాజు ఆరాధనోత్సవాలు లో కూడా పాల్గొనేది విద్యార్థినిగా ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు మంత్రిత్వశాఖ ఢిల్లీ వారి వద్ద నుండి జానపద పాటల కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు కూడా అందుకుంది కాకుండా ఎనిమిది సంవత్సరాల వయసులో ని కూడా సొంతం చేసుకుంది.ఇలా పదిహేను సంవత్సరాల వయ సులోనే మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది.శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబీ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడింది ఈ పాట ప్రజలకు బాగా చేరువయ్యింది ఆ తరువాత తెలుగు కన్నడ మలయాళం భాషలలో సుమారు 3000 పైగా సినిమాలలో పాటలు పాడింది.1994లో ఈమెకు 15 సంవత్సరాలు ఉన్న సమయంలో లలిత సంగీత విభాగంలో ఆల్ ఇండియా రేడియో నుండి నేషనల్ అవా ర్డును కూడా సొంతం చేసుకుంది.సునీత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here