హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రేపటి నుంచి 10రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది.ప్రగ తిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.మే 12 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.లాక్డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.నిత్యావసరాలు ఇతర వస్తువుల కొను గోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి.అత్యవసర సేవలను మాత్రమే అనుమతించను న్నారు.ప్రతిరోజూ 20 గంటలపాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.లాక్డౌన్ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...